నవంబర్‌లో వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరీష్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందిస్తున్న చిత్రం వైశాఖం. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, ఈ నెలలో పూర్తిచేస్తామని అన్నారు. అక్టోబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి, నవంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని, తమ సంస్థనుండి గతంలో వచ్చిన చిత్రాల స్థాయిలోనే ఈ చిత్రం కూడా ఉంటుందని తెలిపారు. కొత్త కథ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, వైశాఖంలో అన్ని కొత్త కథనాలుతోపాటు ఎలిమెంట్స్ ఉన్నాయని, ఓ కొత్త ట్రెండ్‌ను ఈ సినిమా సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదని అన్నారు. టైటిలే చాలామందికి నచ్చిందని, సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుందని, కజకిస్తాన్‌లో పాటల చిత్రీకరణ సమయంలో అక్కడి ప్రజలు తమ పాటలకు ముగ్ధులయ్యారని దర్శకురాలు జయ బి. తెలిపారు. రెండు రోజులు మినహా షూటింగ్ పూర్తయిందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో హీరో హరీష్, వాలిశెట్టి సుబ్బారావు, డి.జె.వసంత్, శివ, సుదర్శన్, బద్రం, శ్రవణ్ చిత్ర విశేషాలను తెలిపారు. ఈశ్వరిరావు, రమాప్రభ, పృథ్వి, కాశీ విశ్వనాథ్, కృష్ణ్భగవాన్, శ్రీలక్ష్మి, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, వెంకి, శ్రీ్ధర్, రామ్‌ప్రసాద్, తేజ, లతీష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.జె.వసంత్, కెమెరా: వాలిశెట్టి వెంకట సుబ్బారావు, నిర్మాత: బి.ఎ.రాజు, సహ నిర్మాత: డి.శివకుమార్, రచన, దర్శకత్వం: జయ బి.