కలిసొచ్చిన రుస్తుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవా భామ ఇలియానా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పాపులర్ అవ్వాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అడపాదడపా వచ్చిన అవకాశాలను అందుకుంటూపోతున్న ఈ భామ బాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌ను చూపించాలని అప్పుడప్పుడు హాట్ హాట్‌గా ఫొటోషూట్‌లకు ఫోజులిచ్చి సంచలనం రేపేది. ఇక ఈమధ్యే అక్షయ్‌కుమార్ సరసన ‘రుస్తుం’ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఈ భామకు మంచి మార్కులే పడ్డాయి. దాంతోపాటు ఈ సినిమా ఏకంగా వంద కోట్ల మార్కెట్‌ను క్రాస్ చేయడంతో ఇలియానా ఆనందానికి అవధులు లేకుండాపోయాయట. ఎందుకో తెలుసా ఈ అమ్మడు నటించిన సినిమా మొదటిసారి వంద కోట్ల మార్కెట్‌ను దాటడం? దాంతోపాటు ఈ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామకు ఇప్పుడు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయట!! ఇప్పటికే బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్‌హస్మి, అజయ్‌దేవగన్‌లు నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఓకే అయింది. దాంతోపాటు మరో పెద్ద ప్రాజెక్టు దక్కిందట! మొత్తానికి ఇలియానా ఫేట్‌ని రుస్తుం మార్చేసినట్టే.