కొత్తదనంతో జ్యో అచ్యుతానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత ఆయన ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో రొమాంటిక్ కామెడీతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈనెల 9న విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
‘నిజానికి ‘ఊహలు గుసగుసలాడే’ చాలా సింపుల్ లవ్‌స్టోరీ. అందులోని బేసిక్ ఎమోషన్ అందరికీ బాగా కనెక్ట్ అవ్వడంవల్లే ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే నా రెండో సినిమా కూడా అలాగే సింపుల్ లవ్‌స్టోరీగా ఉండటం నాకిష్టం లేదు. అలా ఉంటే నాకు ఇది తప్ప మరొకటిరాదని ముద్రపడుతుంది. అందుకనే కాస్త గ్యాప్ తీసుకొని మంచి కొత్తదనమున్న కథ సిద్ధంచేసుకొని వచ్చా.. ఇది నా స్టైల్లోనే కూల్‌గా ఉంటుంది. ఫ్యామిలీ అంతాకలిసి సరదాగా చూడదగ్గ సినిమాగానే ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయి వెంట పడడం అన్నది ఇంతకుముందే చాలా సినిమాల్లో వచ్చి ఉండొచ్చు. ఇందులో అందుకు భిన్నంగా అదే అంశాన్ని చెప్పానని భావిస్తున్నా. రేపు సినిమాచూశాక ప్రేక్షకులూ ఆ కొత్తదనాన్ని ఫీల్ అవుతారనే అనుకుంటున్నా. నారా రోహిత్, నాగశౌర్య, రెజీనాలు తమ పాత్రల్లో అందరూ బాగా నటించారు.
ప్రధాన కథ ఈ ముగ్గురి చుట్టూనే తిరిగేది కావడంతో వాళ్ళూ ఈ సినిమాకోసం లుక్స్ విషయంలో స్వయంగా జాగ్రత్తలు తీసుకున్నారు. మరో సినిమా కూడా చేయనున్నా. అలాగే ‘హంటర్’ అనే ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ చేస్తున్నా. ఆ సినిమాలో ఎమోషన్ బాగా నచ్చడంతో, అడల్ట్ కంటెంట్ అయినా ధైర్యంగా చేయాలని డిసైడ్ అయ్యా. ఇక నానితో ఓ సినిమా ఉంటుంది.’

- శ్రీ