పోస్ట్ ప్రొడక్షన్‌లో వౌనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా లాస్ ఏంజిల్స్ టాకీస్, సంధ్యా సినీ స్టూడియోస్ సంయుక్తంగా కిషన్‌సాగర్ ఎస్. దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘వౌనం’ (వాయిస్ ఆఫ్ సైలెన్స్). అల్లూరి సూర్యప్రసాద్, సంధ్యారవి రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టాకీపార్టు పూర్తిచేసి, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ ఓ డిఫరెంట్ జోనర్‌లో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రాధాన్యత ఉండడంతో ఎం.ఎం.శ్రీలేఖను ఎంపిక చేసుకున్నామని, శివ ఫేమ్ చిన్న ఓ కీలకమైన పాత్రలో నటించారని తెలిపారు. కొలంబోలో పాట చిత్రీకరణ అద్భుతంగా వుంటుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని వారన్నారు. ఈ చిత్రానికి కథ: అనిల్ కె.నాని, మాటలు, ఎడిటింగ్: శివశర్వాణి, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, దర్శకత్వం: కిషన్‌సాగర్ ఎస్.