నితిన్ కొత్త సినిమా ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సంస్థ కార్యాలయంలో గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాత ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి క్లాప్‌నివ్వగా, ఎన్.సుధాకర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర సంయుక్తంగా తమ సంస్థ తరఫున తొమ్మిదవ చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ఓ మంచి కథతో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నవంబర్ ద్వితీయార్థంలో ప్రారంభం కానుందని, శరవేగంగా షూటింగ్ చేసి వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని అన్నారు. ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో అందరినీ ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని తెలిపారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా:యువరాజ్, సంగీతం:విశాల్ చంద్రశేఖర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:హను రాఘవపూడి.