స్టైలిష్ రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, సురభి జంటగా యువి క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు వంశీ ప్రమోద్ మాట్లాడుతూ ఫస్ట్‌లుక్ చూసినవారందరూ స్టైలిష్‌రాజా అని చెబుతున్నారని, ఎక్స్‌ప్రెస్‌రాజాకు మంచి ఆదరణ లభిస్తోందని, మా సంస్థనుండి సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఉంటాయి కనుక గాంధీ చెప్పిన కథ కథనాలు నచ్చి, ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. శర్వానంద్‌ను కొత్తగా ఎలా చూపాలో అలా ఈ చిత్రంలో టేకింగ్ చేశారని, సురభి, ఊర్వశి, ప్రభాస్‌శ్రీను, సప్తగిరి, షకలక శంకర్‌ల పాత్రలు హైలెట్‌గా ఉంటాయని వారు తెలిపారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారన్నారు. దువ్వాసి, బండ రఘు, నాగినీడు, సూర్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: సత్య జి, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.