శింబుకు జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శింబు నటిస్తున్న తాజా చిత్రం ‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’. ఈ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీయ నటిస్తుంది. ఇప్పుడు తమన్నా కూడా ఈ చిత్రంలో నటిస్తుందట. శింబుతో తమన్నాకి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో శ్రీయ, తమన్నాతోపాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. ఇక తమన్నా క్యారెక్టర్ విషయానికి వస్తే- ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్‌కి తమన్నా క్యారెక్టరే కారణం. తమన్నా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది అని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తెలిపారు. అలాగే తమిళ సినిమాల్లో ఇప్పటివరకు ఇంత వైవిధ్యమైన సినిమా రాలేదు అని తమన్నా చెప్పారని ఆధిక్ రవిచంద్రన్ చెబుతున్నారు. మరి శ్రీయ, తమన్నాతోపాటు ఈ చిత్రంలో నటించే మూడో హీరోయిన్ పాత్రను ఎవరు పోషిస్తారో చూడాలి!