భావోద్వేగాల పింక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో హీరోయిన్‌గా చాలా అవకాశాలు వచ్చినాకూడా కెరీర్ పరంగా సరైన కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది తాప్సి. దాంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు, అక్కడ వస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న తాప్సికి గ్లామర్ అవకాశాలు మాత్రం రావడంలేదు. ఈ విషయం పక్కనబెడితే, ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘పింక్’. అమితాబ్‌బచ్చన్‌తో కలిసి తాప్సి నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న తాప్సి తనకు ఈ సినిమా నటిగా చాలా సంతప్తినిచ్చిందని, ముఖ్యంగా అమితాబ్‌లాంటి సీనియర్ నటుడితో నటించడం మర్చిపోలేని అనుభూతి అని చెబుతూనే పింక్ చిత్రం భావోద్వేగాల సమాహారంగా వుంటుందని తెలిపింది.