శ్రీశాంత్ టీమ్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ కథానాయకుడిగా రాజ్ జకారియాస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ గోవింద్ దర్శకత్వంలో రాజ్ జకారియాస్ రూపొందిస్తున్న చిత్రం ‘టీమ్ 5’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ నెలలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, శ్రీశాంత్ ఫాస్ట్‌బౌలరే కాక మంచి డాన్సరని, అందుకు తగ్గట్టు ఆయన డైలాగ్స్, డాన్స్, ఫైట్స్, గెటప్స్, కాస్ట్యూమ్స్ శ్రద్ధతో ఈ చిత్రంలో తీర్చిదిద్దారని తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. కథ మీద నమ్మకంతో శ్రీశాంత్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఉండడంతో ఈ చిత్రాన్ని రూపొందించడానికి ముందుకు వచ్చామని, ఐదుగురు స్నేహితులు బైక్ రైసర్లుగా వారి జీవితంలో ఎలాంటి మార్పులు పొందారు అనే కథనంతో, స్నేహం విలువలు చెబుతూ లవ్‌స్టోరీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించామని, షూటింగ్ పూర్తిచేశామని అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించిందని, త్వరలో ఆడియో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.