ప్రేమకథలంటే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకుని కమర్షియల్ సినిమాలతోపాటు ప్రయోగాత్మక చిత్రాలు చేసి సత్తాచాటుకుంటున్నాడు నాగార్జున. హీరోగా భిన్నమైన సినిమాలు చేస్తూనే కొత్తదనాన్ని అందించాలన్న తపనతో నిర్మాతగా కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సరికొత్త కథా చిత్రాల్ని అందిస్తున్నాడు. ఆయన తాజాగా నిర్మిస్తున్న చిత్రం ‘నిర్మలా కానె్వంట్’. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీయా హీరోయిన్‌గా పరిచయం అవుతూ రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా నాగకోటేశ్వరరావు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా అక్కినేని నాగార్జునతో
ఇంటర్వ్యూ..మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు యాంకర్
చిరంజీవి అని తెలిసింది, నిజమేనా?
- అవును. ఈ షో మూడో సీజన్ చేస్తున్నప్పుడే తప్పుకోవడం మంచిదనిపించింది. దానికి కారణం నాకు వేరే కమిట్‌మెంట్లు ఉండడంవల్ల నాల్గో సెషన్ చిరంజీవిగారు చేస్తున్నారు. ఈ షోతో నాకు మరింత మంచి పేరు వచ్చింది. తప్పకుండా చిరంజీవి కూడా బాగా చేస్తాడనుకుంటున్నాను.
చిరంజీవికి సలహాలిస్తారా?
- ఈ షో విషయంలో నేనే సీనియర్‌ని కాబట్టి చిన్న చిన్న సలహాలు ఇస్తాను. అలాగే, ఈ షోలో హాట్‌సీట్‌లో కూడా కూర్చుంటా.
* నిర్మలా కానె్వంట్ ఎలా సెట్ అయింది?
- క్రియేటివ్ మీడియావాళ్లు ఈ కథను నా దగ్గరకు తెచ్చారు. కథ విన్నప్పుడు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ముఖ్యంగా నాకు ప్రేమకథలు అంటే బాగా ఇష్టం. కాబట్టి ఈ కథ కూడా నాకు కనెక్ట్ అయ్యింది. దాంతో సినిమా చేయాలనుకున్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ కూడా సినిమాలపై ఆసక్తి వుంది. ఆయన నాతో కలిసి సినిమా చేద్దామని అనుకున్న సమయంలో ఈ ప్రాజెక్టు కుదిరింది.

* శ్రీకాంత్ అబ్బాయి రోషన్ గురించి?
- కథ ప్రకారం కొత్తవాళ్లైతే బాగుంటుందని ట్రై చేశాం. ఆ సందర్భంలో రోషన్ ఫొటోలు చూశాను. కథకు కరెక్ట్ అనిపించి అతన్ని ఎంపిక చేశాం. నటుడిగా మొదటి సినిమా అయినా చక్కగా చేశాడు. ముఖ్యంగా నిన్న ఆడియోలో అతను మాట్లాడిన మాటలు చాలా ఆసక్తిగా అనిపించాయి. మొదటి సినిమాకే ఇంత మెచ్యూరిటీ రావడం గొప్ప విషయం.

* ఇందులో మీ పాత్ర గురించి?
- ఈ చిత్రంలో నేను ముఖ్యమైన పాత్ర మాత్రమే పోషిస్తున్నాను. ఇందులో హీరో ఒక్కడే. అతనే రోషన్. ఇందులో నేను హీరో కాదు. కథ ప్రకారం నాది ముఖ్యపాత్ర. అదేమిటన్నది సినిమాలో చూడాల్సిందే.

* సపోర్టింగ్ రోల్స్ బయటి బ్యానర్‌లో కూడా చేస్తారా?
- తప్పకుండా చేస్తా. కానీ, ఆ పాత్ర, కథ నాకు నచ్చి చేయాలనిపిస్తే చేస్తా. ఈ సినిమాలో నేను చేస్తున్న సపోర్టింగ్ రోల్‌కు ఈ ఏడాది బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు ఇవ్వచ్చు.

* నిర్మలా కానె్వంట్ గురించి?
- ఇదో అచ్చమైన ప్రేమకథ అని చెప్పాలి. దీన్ని డీల్ చేసిన విధానం కూడా కొత్తగా వుంటుంది. ప్రేమంటే ప్రతిఒక్కరికీ ఎక్కడో అక్కడ కనెక్టయ్యే వుంటుంది. కాబట్టి సినిమా అందరికీ నచ్చుతుంది. ఇక టైటిల్ అనేది కొత్తగా వుందని పెట్టాం.

* ఓం నమో వెంకటేశాయ సినిమా గురించి?
- షూటింగ్ స్పీడుగా జరుగుతోంది. మంచి భక్తిరస చిత్రమని చెప్పవచ్చు. ముఖ్యంగా రాఘవేంద్రరావుగారు చాలా దీక్షతో సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం కానీ, కుదురుతుందో లేదో. ఎందుకంటే, దీనికి చాలా గ్రాఫిక్స్ వుంటాయి. గ్రాఫిక్స్ పర్‌ఫెక్ట్‌గా చేయాలి. అసలే సిజితో రాజవౌళి బాహుబలిలో వండర్స్ క్రియేట్ చేశాడు. కాబట్టి జాగ్రత్తగా చేయాలి.

* ఈ ఏజ్‌లో కూడా విజయాలతో దూసుకుపోవడంలో రహస్యం ఏంటి?
- మంచి కథలు, మంచి పాత్రలు వేస్తే ఖచ్చితంగా విజయాలు వాటంతటవే వస్తాయి. జాగ్రత్తగా చేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుంది.

* బాహుబలి-2 సినిమా ఓ ఏరియా హక్కులు కొన్నారని వార్తలొస్తున్నాయి, నిజమేనా?
- అలాంటిదేం లేదు. అవన్నీ పుకార్లే.

* చైతూ, అఖిల్‌ల పెళ్లి గురించి వార్తలొస్తున్నాయి?
- తప్పకుండా ఆ సమయం వచ్చినపుడు అందరికీ చెబుతా.

* తదుపరి చిత్రాలు
- ఓం నమో వెంకటేశాయ తరువాత కళ్యాణ్‌కృష్ణతో సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా వుంటుంది. దాంతోపాటు చైతన్య, కళ్యాణ్‌కృష్ణలతో ఓ సినిమా నిర్మిస్తున్నాను. అలాగే, అఖిల్, విక్రం కుమార్‌ల కాంబినేషన్‌లో మరో సినిమా నిర్మిస్తున్నాను. ఈ రెండు సినిమాలు చేస్తానని వారికి మాటిచ్చాను.

- శ్రీ