అక్కడైతే ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాల్లో నటించడానికి సవాలక్ష అభ్యంతరాలు తెలిపే కాజల్ బాలీవుడ్‌కు వెళ్లేసరికి ఒక్క చిన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేయదట. ఇక్కడ చిన్న హీరోలతో నటించమంటే లేదు అనే ఆమె, బాలీవుడ్‌కి వెళ్లేసరికి ఓకే అనేస్తోంది. తాజాగా నూతన నటుడు రణదీప్‌హుడాతో ‘దోలబ్జోంగికహాని’లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నటించేసిందట! అభ్యంతరాలంటే ఇక్కడ లిప్‌లాక్‌లు, ఫ్రెంచ్‌కిస్‌లు అన్నమాట. చిట్టిపొట్టి డ్రెస్‌లతోపాటు స్విమ్ సూట్‌లో కూడా నటించి బాలీవుడ్ జనాల్ని పిచ్చెత్తిస్తోంది. అదే తెలుగులో అయితే లిప్‌లాక్‌లు లాంటివి నోనో అంటోంది. ఇటీవలే విడుదలైన ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చూసిన వాళ్లు అవాక్కయ్యారు. బాలీవుడ్‌లో ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు నిర్మాతలకు కాల్షీట్లు ఇవ్వటానికి చుక్కలు చూపించే ఈమె హిందీలో మాత్రం ఇంత లిబరల్‌గా ఉండడానికి కారణమేమిటి? అని అడిగినా చిరునవ్వు నవ్వి వెళ్లిపోతోంది!