అపార్ట్‌మెంట్‌లో అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ క్రియేటివ్ ఫిలింస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిఖిత ప్రధాన పాత్రలో శివగంగరాజు ఉడిముడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ల రూపొందించిన చిత్రం ‘అపార్ట్‌మెంట్’. సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శివగంగరాజు మాట్లాడుతూ, అపార్ట్‌మెంట్ కల్చర్‌లోకి కొత్తగా వచ్చిన అమ్మాయి అక్కడి విశేషాలను ఎలా తెలుసుకుంది? ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వాటి పరిణామం ఏమిటి? అనే ఇతివృత్తంతో చిత్రం రూపొందించామని, పాటలతోపాటుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ చిత్రంతో తమ సంస్థకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నానని నిర్మాత శ్రీకాంత్ అంగళ్ల తెలిపారు. సంజన, చిన్న, ఉత్తేజ్, విజయ్‌సాయి, రక్ష, అల్లరి సుభాషిణి, ప్రియాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఖుద్దూస్, కెమెరా:సాబూజేమ్స్, ఎడిటింగ్: నాగిరెడ్డి, నిర్మాత:ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ల, కథ, దర్శకత్వం: శివగంగరాజు ఉడిముడి.