వెంకటేష్ సరసన నిత్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది సినిమారంగంలో నటి నిత్యామీనన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న ఆమె ‘జనతా గ్యారేజ్’, ‘ఇంకొక్కడు’ తర్వాత ఓ క్రేజీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వెంకటేష్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించే సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ విషయాన్ని నిత్యామీనన్ స్వయంగా ప్రకటించారు. నేను శైలజ సినిమాతో సూపర్‌హిట్ కొట్టిన కిషోర్ తిరుమల, వెంకటేష్‌తో ఓ కామెడీ సినిమా చేయనున్నారట. ఒక మధ్యవయస్కుడైన వ్యక్తి, ఓ యువతికి మధ్యన జరిగే సరికొత్త ప్రేమకథతో ఈ కామెడీ తెరకెక్కనుందని సమాచారం. వెంకీ ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న సాలా ఖుదూస్ తెలుగు రీమేక్ పూర్తవ్వగానే కిషోర్ తిరుమల సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.