సిద్ధార్థతో గుర్తింపు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.దయానంద్‌రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ‘సిద్ధార్థ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాగిణి నంద్వాణి సిద్ధార్థ సినిమా గురించి విశేషాలను తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గుర్‌గావ్. ముంబయిలో పెరిగాను. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేశాను. శరవణ స్టోర్స్ యాడ్‌లో నటించాను. సినిమాకు హీరోయిన్ కావాలని తెలియడంతో నా ఫొటోలు పంపాను. వారు నన్ను ఆడిషన్ చేసి సెలెక్టు చేశారు. సిద్ధార్థలో మలేసియాలో ఆర్.జె. పాత్రలో కనపడతాను. నాది రెండు షేడ్స్ ఉన్న రోల్. ఒక రోల్‌లో బబ్లీగా ఉంటే, ఎమోషనల్‌గా మరో రోల్‌లో కనపడతాను. తెలుగు మాట్లాడటం చాలా కష్టమైంది. డైలాగ్స్ ముందుగానే తెప్పించుకుని నేర్చుకున్నాను. నేను ఇక్కడకు రాకముందు తెలుగు సినిమాలను కొన్నింటిని చూశాను. మలయాళంలో, తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో విజయ్, మోహన్‌లాల్‌గారి సినిమాలో నటించాను. బేసిక్‌గా సిద్ధార్థ లవ్‌స్టోరీ విత్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్. సాక్షి చౌదరి నాకంటే ముందునుండి సినిమాల్లో నటిస్తోంది. ఆమెతో కలిసి కొన్ని సీన్స్‌లో యాక్ట్ చేయడం చాలా ప్లస్ అయింది. సాగర్ మంచి సహనటుడు. చిత్రీకరణ సమయంలో బాగా సపోర్టు చేశాడు. తెలుగులో నా తొలి సినిమా ఇది. ఇలాంటి సినిమాతో తెలుగులో పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా,