రెండు భాషల్లో ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో పి.వి.పి పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పొట్లూరి వి.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ఇద్దరు హీరోలతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన యూరప్ షెడ్యూల్ విజయవంతంగా చేశామని, ప్యారిస్, లియోన్, బెల్‌గ్రేడ్ వంటి అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేశామని తెలిపారు. స్నేహానికి అర్థం చెప్పే స్నేహితులుగా హీరోలిద్దరూ నటిస్తున్నారని, దర్శకుడు సినిమాను చక్కగా రూపొందిస్తున్నారని, ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుండి ఆదరణ లభిస్తోందని తెలిపారు. తెలుగులో కార్తి చేస్తున్న స్ట్రెయిట్ చిత్రం, నాగార్జున కెరీర్‌లో మెబరబుల్ సినిమాగా ఊపిరి నిలుస్తుందని వారన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: పి.ఎస్.వినోద్, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.