ప్లాటినమ్‌లో లవ్ కే రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిపక్ సరోజ్, మాళవికా మీనన్ జంటగా కోటపాటి శ్రీను దర్శకత్వంలో సి.కళ్యాణ్ సమర్పణలో కందిమళ్ల మూవీ మేకర్స్ పతాకంపై కందిమళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ కే రన్’. ఆడియో విడుదల చేశాక ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సి.కళ్యాణ్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ‘కొత్త కథాకథనాలతో తెరకెక్కించిన లవ్ ఎంటర్‌టైనర్ ఇది. సినిమా బాగా నచ్చింది కాబట్టే సమర్పకుడిగా మారాను. దీన్ని నేనే విడుదల చేస్తున్నాను’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ, ‘ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఈనెల 16న విడుదల చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, సరికొత్త కథాకథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.