కథే హీరోగా వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపక్‌సరోజ్, మాళవికామీనన్ జంటగా కందిమళ్ల మూవీ మేకర్స్ పతాకంపై కోటపాటి శ్రీను దర్శకత్వంలో వెంకట చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘వందనం’ (సేవ్ లవ్). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ కథే హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించామని, మంచి సంగీతంతోపాటుగా ప్రేమ కథకు అవసరమైన రీతిలో పాటలు కుదిరాయని తెలిపారు.
ఓ అందమైన ప్రేమ కథకు అద్భుతమైన కథనం జోడిస్తే ఎలా వుంటుందో ఈ చిత్రం అలా ఉంటుందని, సినిమాలో ప్రతి సన్నివేశం ఓ పెయింటింగ్‌లా కనిపిస్తుందని, మాటలు హైలెట్‌గా ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రానికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.
ఈ చిత్రానికి మాటలు: స్వర్ణసుధాకర్, గుత్తి మల్లాకార్జున్, పాటలు: కాసర్ల శ్యామ్, జిల్లెల ప్రసాద్, సంగీతం: జె.పి, ఎడిటింగ్: మేనగ శ్రీను, కెమెరా: సూర్య, ఎన్‌ఆర్‌ఎం, నిర్మాత: కందిమళ్ల వెంకట చంద్రశేఖర్, దర్శకత్వం: కోటపాటి శ్రీను.