7న ఈడు గోల్డ్ ఎహే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ కథానాయకుడుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వీరు పోట్ల దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర రూపొందిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డ్ ఎహే’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని విజయదశమి కానుకగా అక్టోబర్ 7న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ.. షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలోనే ఆడియోను విడుదల చేయనున్నామని తెలిపారు.
క్లాస్‌ను మాస్‌ను ఆకట్టుకునే ఈ చిత్రం ఆడియన్స్‌ను థ్రిల్ చేసే ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని, సునీల్ కెరీర్‌లో ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలుస్తుందన్నారు. సుష్మారాజ్, రీచాపనయ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో జయసుధ, పునీత్ ఇస్సార్, అరవింద్, చరణ్, పృథ్వి, పోసాని, బెనర్జీ, వెనె్నల కిశోర్, షకలక శంకర్, భరత్, అనంత్, రాజా రవీంద్ర, లంబోదర, నల్లవేణు, గిరిధర్, సుదర్శన్, పి.డి.రాజు, సత్తెన్న, అవంతిక తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: దేవరాజ్, సంగీతం: సాగర్ ఎం.శర్మ, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరు పోట్ల.