వీరప్పన్ ఎప్పుడో తీద్దామనుకున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్మ... ఈ పేరు ఓ పక్క క్రియేటివిటికి, మరోపక్క సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇప్పుడు వర్మ అంటేనే సంచలనం. ఎప్పుడూ ఏదో ఓ వివాదంతో ఆయన వార్తల్లోకి వస్తూంటాడు. ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’కూడా అంతే సంచలనం సృష్టించనుంది. వీరప్పన్‌ను చంపడం ఎలా? అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ జనవరి 1న విడుదల కానుంది. శివరాజ్‌కుమార్, పరుల్‌యాదవ్, యజ్ఞశెట్టి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మతో మాటామంతి...
వీరప్పన్‌పై సినిమా తీయాలని ఎందుకు అనిపించింది?
ఎందుకంటే వీరప్పన్ లాంటివాడు ఆసియాలోనే కాదు ప్రపంచంలో అలాంటి నేర చరిత్ర కలిగినవాడు ఎవ్వరు లేరు. నేను ‘క్షణక్షణం’ సినిమా చేసే సమయంలో అడవిలో షూటింగ్ చేసాం. అప్పుడు చాలామంది ఇది వీరప్పన్ ఉండే ఏరియా కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పారు. అప్పుడే వీరప్పన్ అంటే ఏమిటో తెలిసింది. ఆ తరువాత దాదాపు పదేళ్లకు మళ్లీ ఓ సినిమా షూటింగ్‌కోసం వెళ్ళినప్పుడు కూడా సేమ్ అలాగే అన్నారు. అంటే వీరప్పన్ ఇంపాక్ట్ ఇంకా అలాగే ఉంది? అనే ఆలోచనలోనుండి ఆయన జీవిత కథ తీయాలనే ఆలోచన పుట్టింది.
ఆపేయాలనుకున్న సినిమా మళ్లీ తీయడానికి కారణం?
వీరప్పన్ సబ్జెక్ట్ నాకు ఎప్పటినుండో చాలా ఆసక్తికరంగా వుండేది. 12 ఏళ్ళ క్రితం నేను సినిమా తీయాలనుకుని ఫిక్స్ అయ్యాను. అందులో ముగ్గురు వ్యక్తులు వీరప్పన్ పైన ఉన్న రివార్డ్‌మనీకోసం అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ సినిమా ప్రారంభించిన రోజే వీరప్పన్ చనిపోయాడు. ఇది షాకింగ్‌గా అనిపించింది. చనిపోయిన వ్యక్తిని వెతికి పట్టుకోవటం అనే పాయింట్ మీద సినిమా తీయటం అర్థంలేదని ఆపేశా. తరువాత వీరప్పన్ జీవిత చరిత్ర మీద సినిమా తీయాలనే ఆలోచన కూడా ఉండేది. కానీ అప్పటికే వీరప్పన్ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ బుక్స్ ద్వారా, డాక్యుమెంటరీల ద్వారా జనాలకి తెలిశాయి. అందువల్ల ఆ ఆలోచనని కూ పక్కన పెట్టాను.
వీరప్పన్‌పై సినిమా ఏ కోణంలో ఉంటుంది?
సంవత్సరం క్రితం కన్నన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ గురించి విన్నాను. తను వీరప్పన్ ఇంటలిజెన్స్ ఆపరేషన్‌కు హెడ్. మీడియాలో ఇతని గురించి అప్పటి టాస్క్ఫోర్స్ హెడ్ అయిన విజయ్‌కుమార్ చాలా గొప్పగా పొగిడారు. అప్పటివరకు కన్నన్ కన్నా ముందొచ్చిన పోలీసులందరూ వీరప్పన్ని అడవిలోపల వేటాడి పట్టుకోవాలనుకున్నారు. కానీ కన్నన్ మాత్రం అతన్ని అడవినుండి బయటకు రప్పించాలనుకున్నాడు. ఆ ఆపరేషన్ అసలు ఎలా జరిగిందో అన్న మొత్తం డీటెయిల్స్ నేను చాలామంది దగ్గరనుంచి విన్న తరువాత ఆ వివరాలతో సినిమా తీయాలనుకున్నా. ఎందుకంటే వీరప్పన్ చాప్టర్ భారతదేశపు నేరచరిత్రలోనే అన్నింటికన్నా ముఖ్యమైన ఘట్టం.
పోలీస్ పాత్రలో శివరాజ్‌కుమార్‌తోనే చేయడానికి కారణం?
శివరాజ్ ఇందులో మెయిన్ కాప్‌రోల్ చేస్తున్నాడు. ఇతను వీరప్పన్ చనిపోవటానికి వేసిన ప్లాన్‌లో ముఖ్య పాత్ర పోషించాడు. నేను శివరాజ్‌కుమార్‌పై ఈ పాత్రకి తీసుకోవటానికి గల కారణం నాకు ఆ వయసున్న, ఆ లుక్కున్న అలాగే పెర్ఫార్మెన్స్ ఇవ్వగల వ్యక్తి కావాలి. అంతేకాకుండా వీరప్పన్ కిడ్నాప్ చేసిన ‘రాజ్‌కుమార్’ కొడుకు ఇతను అవడంతో మొత్తం కాస్టింగ్ వాల్యునే పెరిగింది. ఎందుకంటే రియల్ లైఫ్ విలన్‌ని రీల్ లైఫ్ హీరో చంపుతాడు. ఇందులో అతను చేసిన పెర్ఫార్మెన్స్‌కి చాలా ఇంప్రెస్స్ అయ్యాను.
నిజమైన వీరప్పన్‌ను చూపించారు?
అందరూ అనుకున్నట్టు సందీప్‌కి, వీరప్పన్‌కి నిజ జీవితంలో ఎటువంటి పోలికలు వుండవు. ఈ క్రెడిట్ మాత్రం మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్‌ది. తను సందీప్‌ని పూర్తిగా వీరప్పన్‌లాగా మార్చేశాడు. అలాగే సందీప్ గొప్ప నటుడు. తను ఫిజికల్‌గానే కాకుండా, మెంటల్‌గా ఈ పాత్రలో ఒదిగిపోవటానికి ప్రిపేర్ అయినందుకు తనకు కూడా ఈ క్రెడిట్‌లో చాలా భాగముంది. ఆల్రెడీ ఈ సినిమా చూసిన చాలా మంది సినిమా రిలీజ్ అయ్యాక అసలు వీరప్పన్ని మరిచిపోయి సందీప్‌నే గుర్తుపెట్టుకుంటారని చెప్పారు.
వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వివాదం సద్దుమణిగిందా?
అడవిని, అందులో వుండే జంతువులను కొంతమంది అవినీతి గవర్నమెంట్ అధికారుల నుండి కాపాడే తన భరె్తైన వీరప్పన్‌ను మేము నెగటివ్ యాంగిల్లో చూపిస్తున్నామని ఆమె ఉద్దేశం. అంతేకాకుండా అలా వీరప్పన్ని నెగటివ్ యాంగిల్ చూపటం వల్ల కన్నడ మరియు తమిళ ప్రజల మధ్య గొడవలొచ్చే అవకాశం ఉందని ఇంకా సెన్సార్‌బోర్డ్ కూడా మేము (నేను, శివరాజ్) ఒక్కటై చేసినట్టు ఆమె అభ్యంతరం తెలిపింది. ఏదైతేనేం చివరగా ఆమెతో మేము కోర్ట్ బయటే మాట్లాడి ప్రాబ్లెం సాల్వ్ చేసుకున్నాం. ఆమె ఉద్దేశంలో వీరప్పన్ మహాత్ముడి లాంటి వ్యక్తి. నిజ జీవితంలో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి క్యారెక్టర్‌ని యజ్ఞశెట్టి చేస్తుంది. నేను ముత్తులక్ష్మిని కలిసినప్పుడు ఆమె పోలీసులు వీరప్పన్ని పట్టుకోవటానికి చేసిన ఆపరేషన్స్ గురించి, ఇంకా వీరప్పన్‌తో తనకున్న పర్సనల్ రిలేషన్ విషయాలు మరియు నేరచరిత్ర గురించి కూడా చెప్పింది. అలాగే యజ్ఞాకి, ముత్తులక్ష్మికి దగ్గర పోలికలు ఉండడంతో ఆ క్యారెక్టర్ బాగా పండింది. నాకు తెలిసినంతవరకు ఒక సినిమాలో విలన్‌కు లవ్‌స్టోరీ వుండి హీరోకి లేకపోవటం ఇదే మొదటిసారి.
సెన్సార్‌వల్ల సమస్యలు ఉన్నాయంటూ కామెంట్ చేసారు కదా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో సెన్సార్ వాళ్ళ వ్యవహారం కరక్ట్ కాదని నా భావన. ఒక్క ఐదు, ఆరు మంది కమిటీ చూసి సమాజం ఏది చూడాలో, ఏది చూడకూడదో చెప్పే అవసరం ఉందంటారా? ఈ రోజుల్లో సెల్‌ఫోన్‌లోనే పోర్న్ వీడియోలనుండి ఎన్నో అసాంఘిక కార్యకలాపాలని డైరెక్ట్‌గా చూస్తున్నప్పుడు సినిమాలో ఇలాంటి అభ్యంతరాలు కరెక్ట్ కాదు. సెన్సార్ వాళ్ళ విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకో ఉదాహరణ చెపుతా వీరప్పన్ తన సొంత కూతురుని చంపే సీన్లో పాప ఏడ్చే సౌండ్‌ని తీసేయమన్నారు. అందువల్ల మేము ఆ సౌండ్‌ని మాత్రం మ్యూట్ చేశాం. అంతేగాని మిగతా సినిమాలో పెద్దగా కట్స్ చెప్పలేదు చిన్నచిన్నవి తప్ప. ఈ సీన్ సినిమాకు హైలెట్. పాప ఏడవడంవల్ల అతను చంపేసాడు అనేది జనాలకి తెలియాలి, కాని సౌండ్ తీసేస్తే ఎలా తెలుస్తుంది.
వీరప్పన్ గురించి ఎప్పే వివరాలు ఎలా, ఎక్కడ సేకరించారు?
నిజ జీవిత కథలకి సంబంధించిన సమాచారం అనేక రూపాల్లో వేరువేరు ఆధారాల నుండి వస్తుంది. వీరప్పన్‌ను పట్టుకోవటానికి ప్రయత్నించిన కర్ణాటక, తమిళనాడు పోలీసులు, వీరప్పన్ మాజీ అనుచరులు మరియు బంధువులు, ఇంకా పేర్లు చెప్పలేని కొంతమంది వ్యక్తులనుండి నేను సేకరించిన విస్తృత సమాచారంతో ఈ సినిమా తీయటం జరిగింది.
మీ తదుపరి సినిమాల గురించి?
జనవరి చివర్లో నేను తీసిన ‘అటాక్’ సినిమా విడుదలవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘సర్కార్ 3’ తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది...

- శ్రీ