అమ్మాయిలకు నచ్చే కానె్వంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీయా శర్మలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీమ్‌వర్క్స్ పతాకాలపై నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘నిర్మలా కానె్వంట్’. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 16న విడుదల కానున్న సందర్భంగా హీరోయిన్ శ్రీయా శర్మతో చిట్ చాట్...
* మీ గురించి?
- మాది హిమాచల్‌ప్రదేశ్. నాన్న ఇంజనీర్, అమ్మ డైటీషియన్. చిన్నప్పట్నుంచి పలు యాడ్స్, సీరియల్స్‌లో నటించడంతో నటన అంటే ఆసక్తి పెరిగింది.
* ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ‘నిర్మలా కానె్వంట్’ ప్రెష్, ప్యూర్ అండ్ ఇన్‌స్పైరింగ్ లవ్‌స్టోరీ. ఈ చిత్రంలో శాంతి అనే అమ్మాయి పాత్రలో కనపడతాను. చాలా కోపం, అసూయ ఉండే అమ్మాయే శాంతి. ఈ సినిమా చూసేటప్పుడు అమ్మాయిలు నా పాత్రతో బాగా కనెక్ట్ అవుతారు.
* చాలా సినిమాల్లో చేశా...
- ‘గాయకుడు’ సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చాను. అంతకంటే ముందు చిరంజీవి, రజనీకాంత్, షారూక్‌ఖాన్ వంటి సూపర్‌స్టార్స్‌తో యాక్ట్ చేశాను. ఇక ‘నిర్మలా కానె్వంట్’ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో నాగార్జునతో కొత్త కొత్త భాష.. సాంగ్‌లో యాక్ట్ చేశాను. అంత పెద్ద నటుడితో యాక్ట్ చేయడం హ్యాపీగా అనిపించింది. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. అలాగే రోషన్‌కు ఇదే తొలి సినిమా. అయినా తను చాలా కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేశాడు.
* టెక్నికల్ పరంగా సినిమా ఎలా వుంటుంది?
- దర్శకుడు నాగ కోటేశ్వరరావు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి సీన్ చాలా ప్రెష్‌గా అన్పిస్తుంది. సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఆయనే కారణం. రోషన్ సాలూరి ఆడియో ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయ్యింది. తన వల్లనే నాగార్జునగారు పాట పాడారు. ఆ పాట సెనే్సషన్ క్రియేట్ చేసింది.
* తదుపరి చిత్రాలు..
ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా తర్వాత తెలుగులో నెక్స్ట్‌మూవీ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అలాగే హిందీలో కూడా ఓ సినిమా చేయబోతున్నాను.

-శ్రీ