మణిరత్నం దర్శకత్వంలో చరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీ దర్శకుడిగా దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్‌గా ఇమేజ్ తెచ్చుకున్న మణిరత్నం ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకందించాడు. దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ప్రస్తుతమున్న యంగ్ హీరోల్లో కూడా చాలామంది ఆయనతో సినిమా చేయాలని ఆరాటపడుతుంటారు. అలాంటి గొప్ప అవకాశం ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు దక్కిందని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు మణిరత్నం, చరణ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్‌గా ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఇందులో అల్లు అర్జున్ కూడా నటిస్తాడని, ఈ ప్రాజెక్టు దాదాపు కన్‌ఫర్మ్ అయినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై మణిరత్నం నుండిగాని, మెగా క్యాంపునుండిగాని ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధ్రువ’ చిత్రంలో నటిస్తున్నాడు.