పిచ్చిగా నచ్చావ్ అంటున్న చేతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై శశిభూషణ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం రూపొందిస్తున్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. ఉత్తేజ్ తనయ చేతన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను హీరో శర్వానంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- బాలనటిగా అనే చిత్రాల్లో నటించిన చేతన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం హిట్ అవ్వాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా పేరు క్యాచీగా వుందని, చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయని, సరికొత్త స్క్రీన్‌ప్లేతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం తప్పక నచ్చుతుందని దర్శకుడు శశిభూషణ్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు.