గేదె కోసం బ్రేకింగ్ న్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభి, వరుణ్, ఫణి, సందీప్తి ప్రధాన పాత్రధారులుగా శ్రీలక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహనంది దర్శకత్వంలో బూచేపల్లి తిరుపతిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్ ఫిలిం చాంబర్ హాల్‌లో ఎం.పి. వై.వి.సుబ్బారెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా మంచి కథతో చేస్తున్నారని, తప్పక విజయవంతం అవుతుందన్నారు. ఓ గేదె ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించిందని, పల్లెటూళ్లల్లో కుటుంబాల పోషణకు గేదెలు ఆధారమని, బిడ్డలా చూసుకునే అలాంటి గేదె ఓ ప్రమాదంలో చనిపోతే, శిక్షపడాలంటూ యజమాని న్యాయంకోసం చేసిన పోరాటమే ఈ చిత్రంలో ప్రధాన ఇతివృత్తమని, ఇందులో మీడియా గురించి కూడా చెప్పామని ఆయన అన్నారు. దర్శకుడు మంచి పాయింట్‌తో కమర్షియాలిటీ వున్న ఈ చిత్రం రూపొందించారని, అందరినీ ఆలోచింపచేస్తుందని సహ నిర్మాతలు తెలిపారు. కార్యక్రమంలో బసిరెడ్డి, అభి, ఫణి, మహంతి, సిల్వర్ సురేష్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.