ఎదిగినా ఒదిగి ఉండాలి - ఊహాశ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోషన్, శ్రీయా శర్మ జంటగా నటించిన ‘నిర్మలా కానె్వంట్’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా రోషన్ తల్లిదండ్రులు హీరో శ్రీకాంత్, ఊహా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, అందరూ ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారని, నిజానికి రోషన్‌ను హీరోగా ఇప్పుడే పరిచయం చేయడం తమకు ఇష్టం లేదని, ఓ మంచి అవకాశం అన్నపూర్ణ స్టూడియో లాంటి పెద్ద సంస్థ నుండి నాగార్జున లాంటి పెద్ద నటుడు సపోర్టు ఇవ్వడంతో ముందుకు వచ్చామని ఆయన అన్నారు. తాము కెరీర్ తొలినాళ్ళల్లో అనేక కష్టాలుపడి వచ్చామని, అయితే, వీరికి అటువంటి ఇబ్బందులు ఏమీ లేవని, పరిశ్రమలో ఎంత ఎదిగినా అంత ఒదిగి వుండాలనే విషయాన్ని రోషన్‌కు తాను చెబుతూనే ఉంటానని తెలిపారు. అతని నటన ఈ చిత్రంలో చూసి సంతోషం కలిగిందని, ‘రుద్రమదేవి’ చిత్రంలో చిన్ననాటి రాణాగా రోషన్ నటించాడని, ఈ సినిమాతో అతని కెరీర్‌కు ఓ మంచి బీజం పడినట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. ఈ సినిమా తరువాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని ఫుల్ ప్లెడ్జ్‌డ్ హీరోకు కావాల్సిన అన్ని హంగులు కూర్చుకుని సినిమాలు చేయడానికి సిద్ధం చేస్తామని ఆయన వివరించారు. రోషన్ హీరో అవుతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని, క్రికెటర్‌గా చేయాలని శ్రీకాంత్ భావించాడని నటి ఊహ తెలిపారు. మొన్న జరిగిన ఆడియో వేడుకలో రోషన్ మాట్లాడిన విధానం, అతని మెచ్యూరిటీ చూసి సంతోషపడుతున్నానని, అప్పుడప్పుడు చిన్న చిన్న సలహాలు అతనికి ఇస్తూ ఉంటానని ఆమె తెలిపారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాగార్జునకు, నిర్మాతకు, తల్లిదండ్రులకు తాను ధన్యవాదాలు చెబుతున్నానని, క్రికెట్ ప్లేయర్‌గా అవకాశం వచ్చిన సమయంలోనే ఈ ఛాన్స్ కూడా వచ్చిందని, మంచి అవకాశాన్ని వదులుకోకూడదని తాను నటించానని రోషన్ తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌లో నాగార్జున సరసన నటించడానికి మొదట బిడియపడినా, ఆ తరువాత ధైర్యం వచ్చిందని, హీరోయిన్‌గా నటించిన శ్రీయాశర్మ మంచి మార్కులు కొట్టేస్తుందని రోషన్ తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం:జి.నాగకోటేశ్వరరావు.