అభిమానులకు జనతా కానుక - ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా వెనుక అభిమానులున్నారు. ఇన్నాళ్లు నా విజయం కోసం ఆగారు. వారు తలెత్తుకునేలా చేసిన ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాతలకు రుణపడి వుంటాను’ అని ఎన్టీఆర్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ ప్రధాన తారాగణంగా ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్, సి.వి.రాంమోహన్ సంయుక్తంగా రూపొందించిన ‘జనతా గ్యారేజ్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఈ సినిమా విడుదలైనపుడు అనేక రకాల రిపోర్టులు వచ్చాయని, ఏం మాట్లాడాలో తెలియని సమయంలో ఆరోజు సాయంత్రం నుండే మంచి రిపోర్ట్స్ వింటుంటే ఆనందం కలిగిందని, ఈ చిత్రంవల్ల అభిమానుల ముఖాల్లో, తన తల్లిదండ్రుల మనసుల్లో ఆనందం నిండిందని, ఈ చిత్ర విజయంలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన అన్నారు. ఈ సినిమాను తమ చిత్రంగా భావించిన అభిమానుల కారణంగానే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందని, ఎన్టీఆర్‌కు సక్సెస్ కొత్త కాకపోయినా, తాను ఈ సక్సెస్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉన్నానని చిత్ర దర్శకుడు కొరటాల శివ తెలిపారు. మూడేళ్లుగా తాము ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నామని, తమ తండ్రి షష్ఠిపూర్తిగా అభిమానులు ఇచ్చిన కానుకగా ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నామని కల్యాణ్‌రామ్ తెలిపారు. కార్యక్రమంలో నిర్మాతలు రామజోగయ్య శాస్ర్తీ, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, డి.వి.వి.దానయ్య, సాయికుమార్, సురేష్ తదితరులు చిత్ర విశేషాలు తెలిపారు. అనంతరం చిత్ర యూనిట్‌కు అతిథులు విజయోత్సవ జ్ఞాపికలను అందజేశారు.