భలే మంచిరోజుతో గుర్తింపు వచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఆయన, సుధీర్‌బాబు కథానాయకుడుగా ‘్భలేమంచి రోజు’ క్రిస్మస్ కానుకగా విడుదలైంది. ఈ చిత్రంతో తనకు మంచి గుర్తింపు వస్తోందని, సినిమాకు ఆదరణ బాగుందని దర్శకుడు తెలియజేస్తున్నారు. ఆయన చెప్పిన విశేషాలు..
హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన నేను బెంగుళూరులో చదివి, హైదరాబాద్ వచ్చి మెకానికల్ ఇంజనీర్ చేశానని తెలిపారు. పదో తరగతిలో ఉన్నప్పుడే దర్శకుడు కావాలనే ఆలోచన వచ్చిందని, మంచి ఉద్యోగం చేయాలని చిన్నప్పటినుంచి కోరిక ఉండడంతో రెండున్నరేళ్ళు గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలలో ఉద్యోగం చేశానని తెలిపారు.
8 లఘు చిత్రాలు చేయగా, అందులో ఐదు చిత్రాలకు పలు అవార్డులు వచ్చాయని, ఓ లఘు చిత్రానికి అంతర్జాతీయ పురస్కారం, మరో రెండు జాతీయ పురస్కారాలు అందుకున్నానని తెలిపారు. లఘు చిత్రాలు చేయడంవల్ల దర్శకత్వంపై బేసిక్ ఐడియా వస్తుందని, అదే రెగ్యులర్ ఫార్మాట్ చిత్రమైతే సినిమా యూనిట్ అందర్నీ దర్శకుడు కథతో నమ్మించాలని, కానీ కష్టంలో ఎటువంటి మార్పు ఉండదని తెలిపారు. నలుగురు హీరోలతో మొదట ఓ కథ రాసి, అవకాశాలకోసం ప్రయత్నిస్తే, తెలుగులో ఇటువంటి కథలు ఆడవని, అనేకమంది చెప్పారని, ఓరోజు యాక్సిడెంట్ సన్నివేశం ఆలోచన వస్తే దాని చుట్టూ కథ రాసి, నిర్మాత విజయ్‌కి వినిపించానని తెలిపారు. కథ నచ్చడంతో ఆయన సుధీర్‌బాబు అయితే సినిమా చేస్తారా? అని అడిగారని, ‘కృష్ణమ్మకలిపింది ఇద్దరినీ’ చిత్రంలో సుధీర్‌బాబు చేసిన నటన నచ్చడంతో కథకు సూటయ్యే కథానాయకుడని తాను నమ్మానని తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ చేసేటప్పుడు అనేకమంది సీనియర్ నటీనటులతో పనిచేయడం మధురమైన అనుభూతి అని, ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రేక్షకులను ఆసక్తిగా థియేటర్‌లో కూర్చోపెట్టగలిగే కథాకథనాలు ‘్భలేమంచిరోజు’ చిత్రంలో ఉన్నాయని ఆయన తెలిపారు. శామ్‌దత్ కెమెరా పనితనం, సన్నీ ఎం.ఆర్. సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా మారితే, మహేష్‌బాబు ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌కి మంచి అప్లాజ్ వస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి నాలుగైదు కథలు సిద్ధంచేసుకున్నానని, త్వరలో తదుపరి చిత్రాల వివరాలను ప్రకటిస్తానని ఆయన వివరించారు,

- యు