సుకుమార్ డైరెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో దర్శకుడు సుకుమార్ అంటే ఓ ప్రత్యేక క్రేజ్. మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్‌లలో ఒకరుగా పేరుతెచ్చుకున్న సుకుమార్ నిర్మాతగా వినూత్న సినిమాలను తెరకెక్కించే పనిని కూడా చేపట్టిన విషయం తెలిసిందే. ఆ కోవలోనే సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్‌ను స్థాపించి మొదటి సినిమాగా ‘కుమారి 21ఎఫ్’ను రూపొందించారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓ బోల్డ్ కానె్సప్ట్‌ను ప్రస్తావించినందుకు సుకుమార్‌కు ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. కాగా మొదటి సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో సుకుమార్ అప్పుడే తన రెండో సినిమాను కూడా మొదలుపెట్టేందుకు సిద్ధమైపోయారు. ‘డైరెక్టర్’ పేరుతో రూపొందే ఈ సినిమా ద్వారా సుకుమార్ మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ స్వయంగా ఈ కథను రాయడం విశేషం. ఇక ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేలా పనులన్నింటినీ వేగవంతం చేసిన సుకుమార్, జనవరి నెలాఖర్లో ‘డైరెక్టర్’ను సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నట్లు తెలిసింది.