ఎన్టీఆర్ నటనను మెచ్చుకోరేం -కోటా శ్రీనివాసరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతకాలంగా టాలీవుడ్‌లో వస్తున్న ఓ కొత్త సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్న నటుడు కోట శ్రీనివాసరావు తాజాగా మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కారెక్టర్ ఆర్టిస్టులుగా తెలుగువాళ్ళు పనికిరారా? ఎక్కడెక్కడినుంచో విమాన ప్రయాణాలను భరించి, స్టార్ హోటళ్లలో వారికి నివాసం ఏర్పాటు చేసి, సినిమాల్లో అవకాశాలు ఇచ్చి నటింపజేస్తున్నారని, అలా వస్తున్న నటులు సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతున్నారో ఎవరూ గుర్తించటంలేదని, కేవలం కాంబినేషన్ పరంగా మాత్రమే ఇదో వేలంవెర్రిగా తయారైందని గతంలోనే కోట శ్రీనివాసరావు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. తాజాగా ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో మలయాళ నటుడు మోహన్‌లాల్‌ను తీసుకువచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ పవర్‌ఫుల్ పాత్రను ఇచ్చారు. ఆ పాత్రలో మోహన్‌లాల్ నటన అద్భుతమని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన కోట శ్రీనివాసరావు, ఉత్తమ నటుణ్ణి తీసుకువచ్చి, ఆ సినిమాలో మోహన్‌లాల్ అద్భుతంగా నటించాడు, అద్భుతంగా నటించాడు అంటూ చెబుతున్నారని, ఇదో హాస్యాస్పద విషయంగా ఆయన వ్యాఖ్యానించారు. సినిమా విడుదలైనప్పటినుండి సినిమా హీరోగురించి ఎవరూ మాట్లాడడంలేదని, మోహన్‌లాల్ గొప్పగా చేశాడు, గొప్పగా చేశాడు అని అంటున్నారే తప్ప మిగతావాళ్ల గురించి ఎవరూ మాట్లాడడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌లాల్ పక్కన చేసిన నటుడు తెలుగు ప్రేక్షకులకు నచ్చాలంటే ఎంత బాగా నటించి ఉండాలి? ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదని, కేవలం ఉత్తమ నటులుగా వున్నవారిని పెట్టుకుంటే సినిమా హిట్ అయిపోతుంది అనుకోవడం తప్పని ఆయన తెలిపారు.