ప్రేమబిక్ష పాటల రికార్డింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం శ్రీ క్రియేషన్స్ పతాకంపై అనీల్, శృతిలయ జంటగా ఆర్.కె.గాంధి దర్శకత్వంలో ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమబిక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు ఓ మంచి కథ తయారుచేశారని, ప్రేమబిక్ష అనే పేరు ఈ చిత్రానికి ఖచ్చితంగా సరిపోతుందని తెలిపారు. ఈ నెల 19నుండి షూటింగ్ ప్రారంభంకానున్నదని, 75 శాతం భద్రపట్నంలోనే చిత్రీకరిస్తామని వారు తెలిపారు. సుమన్, షఫి, రాజేంద్ర, కింగ్ మోహన్, కిల్లర్ వెంకటేష్, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:రామ్‌పైడిశెట్టి, కెమెరా:ప్రమోద్, సంగీతం:ఘంటాడి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.కె.గాంధి.