దశ తిరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో పనికిరావు పొమ్మంటే తాప్సీ బాలీవుడ్‌కి వెళ్లి రెండో మూడో చిత్రాలను పట్టేసింది. పడితే పట్టేసింది గానీ మంచి చిత్రాలను పట్టింది. ఈ దెబ్బతో తాప్సీ కరువు తీరింది. ఇన్నాళ్లు నటన రాదని, ఆమె నటిస్తే సినిమా ఫట్ అని రకరకాల రూమర్లు తాప్సీమీద వుండేవి. అవన్నీ ఒక్క సినిమా దెబ్బకు ఎగిరిపోయాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘బేబీ’ సినిమాతో హిట్ కొట్టిన తాప్సీ కెరీర్‌ను ‘పింక్’ సినిమా పీక్స్‌కి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో తాప్సీ నటనకు అన్ని వర్గాలనుండి హర్షం వ్యక్తం అవుతోంది. దానికితోడు ఈ చిత్రంలో బిగ్‌బీ ప్రధాన పాత్రలో నటించడం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ఓ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుద్ధరాయ్ చౌదరి దర్శకత్వం వహించారు. ఇక తాప్సీకి బాలీవుడ్‌లో ఎదురులేదు. లక్ అంటే అది!

చిత్రం..తాప్సీ