లిటిల్ స్టార్స్ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రషీద్ బాషా దర్శకత్వంలో తస్లీమ్, దివిజ, శ్రేష్ఠ, చరణ్, హర్ష, సోని, నిఖిత ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. ఇబ్రహీం షేక్, ఖాజాబీ షేక్, నజీమ్‌షేక్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు తొలి సీడీని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రంలో ఉన్న సందేశం ప్రేక్షకులకు చేరితే ఇటువంటి మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం ఉందని, చిన్నపిల్లల సినిమాలకు ప్రత్యేకంగా థియేటర్లు కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిందని, తొందరలోనే ఆ పనులు అమలుచేయాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన అన్నారు. చిన్నపిల్లలతో సినిమా తీయడమనేది చాలా కష్టమైన విషయమని ఈ సినిమా అందరికీ నచ్చి, మంచి పేరు తెచ్చుకోవాలని తాను కోరుకుంటున్నట్లుగా నటుడు వంశీ తెలిపారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో జీవనాధారం కోల్పోయిన తమ స్నేహితురాలి కుటుంబానికి ఆరుగురు చిన్నారులు ఎలాంటి సహాయం చేశారు, ఆ క్రమంలో వారు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? అనే కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు రషీద్ బాషా తెలిపారు. కార్యక్రమంలో రాంకి, సాయివెంకట్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిషన్‌సాగర్, సంగీతం: శ్రీవెంకట్, నిర్మాతలు: ఇబ్రహీం షేక్, ఖాజాబీ షేక్, నజీమ్ షేక్, దర్శకుడు: రషీద్ బాషా.