భయపెట్టనున్న అవంతిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ‘అవును’ లాంటి హారర్ చిత్రాల్లో నటించిన పూర్ణ, మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తోంది. భీమవరం టాకీస్ పతాకంపై పూర్ణ, గీతాంజలి ప్రధాన తారాగణంగా శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందిస్తున్న హారర్ ఎంటర్‌టైన్‌మెంట్ అవంతిక. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రేలంగి నరసింహారావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ- తమ సంస్థలో 90వ చిత్రంగా అవంతిక రూపొందుతోందని, హారర్ చిత్రాల కోవలోనే ఈ సినిమా మంచి సినిమాగా వస్తోందని అన్నారు. కథపై నమ్మకంతో రాజీపడకుండా భారీగా రూపొందిస్తున్నామని, 34 రోజులపాటు చేసే షెడ్యూల్‌తో సినిమా పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అవంతిక పాత్రకు పూర్ణ వందశాతం సరిపోతుందన్న నమ్మకంతో ఆమెను తీసుకున్నామని, దేవుడికి బలులు సమర్పిస్తే మంచి జరుగుతుందనే నమ్మకం పూర్వకాలంగా వున్న పాయింట్‌ను తీసుకుని హారర్ నేపథ్యంలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్ పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు శ్రీరాజ్ తెలిపారు.‘అవంతిక’ చిత్రాన్ని అరుంధతితో పోల్చడం తన అదృష్టమని, ఈ సినిమా తన కెరీర్‌కు ప్లస్ పాయింట్ కాగలదని కథానాయక పూర్ణ అన్నారు.