పడమటి సంధ్యారాగం పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో స్థిరపడిన చైతు శాంతారామ్, శ్యాహేలరాణి జంటగా గణేష్ క్రియేషన్స్ పతాకంపై వంశీమునిగంటి దర్శకత్వంలో లండన్ గణేష్ రూపొందించిన చిత్రం ‘పడమటి సంధ్యారాగం’ (లండన్‌లో). ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ బిగ్‌సీడీని, ఆడియో సీడీని విడుదల చేశారు. దాసరి నారాయణరావు వీడియో ద్వారా సందేశం అందించారు. ఈ సందర్భంగా నిర్మాత గణేష్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో లండన్‌లో నిర్మించిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా ఆద్యంతం వినోదంగా సాగే సున్నితమైన ప్రేమకథకు ఈ చిత్రాన్ని రూపొందించామని, విదేశాలలో స్థిరపడిన తెరుగువారి స్థితిగతులను, ఇప్పటి పరిస్థితుల్లో ఇండియా, బ్రిటన్‌లో వున్న సంస్కృతి బేధాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రం చేశామని తెలిపారు. లండన్‌లో స్థిరపడిన దాదాపు 30 మంది తెలుగు నటులు, కొందరు బ్రిటిష్ నటులు ఈ చిత్రం ద్వారా పరిచయవౌతున్నారని ఆయన అన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ సినిమా మీద మక్కువతో సెలవు దినాలలో వచ్చి ఈ చిత్రంలో వారు నటించారని, లండన్‌లో వున్న తెలుగువారు ప్రోత్సాహంతో ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని ఆయన అన్నారు. తెలుగుతనం ఉట్టిపడేలా చక్కని కథతో అందరూ మెచ్చేలా వినోదాత్మకంగా ఫ్యామిలీ సెంటిమెంట్‌తో చిత్రాన్ని రూపొందించామని, సాహిత్య విలువలతో కూడిన పాటలు, ప్రేమ ఎమోషన్స్ కామెడీ లాంటి అంశాలు చిత్రంలో అందరికీ నచ్చుతాయని దర్శకుడు వంశీ తెలిపారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కేశవ్‌కిరణ్, సలామ్ యూసుఫ్, ధీరజ్ తోట, రమేష్ ఎస్సంపల్లి, పెరోజ్‌షేక్ తదితరులు పాల్గొన్నారు. మిరబెల్ స్టువర్ట్, సూర్య, ఆకాష్, ధన్‌రాజ్, వేణు, రాములు దసోజ్, ధర్మవతి, పద్మ, శ్రవణ్‌కుమార్‌గౌడ్, అనిత నోముల, బేబి నిత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వరప్రసాద్, సంగీతం: కేశవ్‌కిరణ్, నిర్మాత: లండన్ గణేష్, రచన, దర్శకత్వం: వంశీ మునిగంటి.