మనలో ఒకడికి ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ సంగీతం అందిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌ను మిలియన్ క్లిక్స్ డిస్క్ వేడుకతో సత్కరించారు. ఈ సందర్భంగా గాయకుడు కె.జె.జేసుదాస్ మాట్లాడుతూ- తన ఐదవ ఏటే సంగీతాన్ని మొదలుపెట్టానని, ఇప్పటి గాయనీ గాయకులకు నిరంతరం సాధన చేయమని చెబుతానని, తన గాత్రాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని వదిలేశానని అన్నారు. మన భారతీయ సంస్కృతిని తెలుసుకొని గౌరవించాలని, ఎప్పటికీ విద్యార్థిగా నేర్చుకుంటూనే వుండాలని ఆయన అన్నారు. ఆడియో సీడీలు ఎవరూ కొనకపోవడంతో ప్లాటినమ్ డిస్క్ అనే పదం సరైనది కాదని, మిలియన్ క్లిక్స్ అనే పదం ఈ సినిమాతో ప్రవేశపెడుతున్నామని, నాలుగు పాటలున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆర్.పి.పట్నాయక్ అన్నారు. సమాజంలో ఓ సామాన్యుడు ఏం చేయగలడు, మీడియా నేపథ్యంలో జరిగేటప్పుడు ఎలా వుంటుంది అన్న కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని జగన్‌మోహన్ అన్నారు. నిర్మాతలు ఉమేష్‌గౌడ్, బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.