పూరి కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో వున్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ స్టైలే వేరు. ఆయన ఏది చేసినా కొత్తగా రిచ్‌గా వుంటుంది. ముఖ్యంగా కథలు రాసేటప్పుడు ఆయన తీరే వేరు. చక్కగా బ్యాంకాక్‌కు వెళ్లిపోయి పది పదిహేను రోజుల్లో కథను రాసుకొచ్చేస్తాడు. అలా బ్యాంకాక్‌లో రూపుదిద్దుకున్న అనేక కథలు సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కల్యాణ్‌రామ్‌తో రూపొందిస్తున్న ‘ఇజం’ చిత్రాన్ని పూర్తిచేశాడు. తాజాగా ఎన్టీఆర్ కోసం కథ రాయడానికి బ్యాంకాక్ చెక్కేసాడు. ‘జనతా గ్యారేజ్’ చిత్రం తరువాత ఎన్టీఆర్ మరే చిత్రానికి కాల్షీట్ ఇవ్వలేదు. పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ రాయమని ఎన్టీఆర్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇంకొక వారం రోజుల్లో స్క్రిప్ట్‌తో తిరిగి వచ్చి తారక్‌ను మెప్పిస్తాడని సమాచారం.