వేగంగా వస్తున్న జాగ్వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్‌కుమార్ కథానాయకుడుగా చెన్నాంబిక ఫిలిమ్స్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితాకుమారస్వామి రూపొందించిన చిత్రం జాగ్వార్. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అనితాకుమారస్వామి మాట్లాడుతూ.. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల చేయడానికి సిద్ధవౌతున్నామని, సినిమా కథనం జెట్ స్పీడ్‌లో సాగేలా స్క్రీన్‌ప్లేను దర్శకుడు రూపొందించారని, కథానాయకుడు జాగ్వార్ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడని, తెరపై జెట్ స్పీడ్‌లో సాగే ఓ జాగ్వార్‌ను చూస్తారని, తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం రెండు భాషల్లో కూడా విజయవంతవౌతుందన్న నమ్మకం వుందని తెలిపారు. విజయేంద్రప్రసాద్ అందించిన కథతో ‘బాహుబలి’ ఎంత విజయవంతమైందో ఈ చిత్రం కూడా అంతే విజయం సాధిస్తుందని, నిఖిల్‌కుమార్ తొలి చిత్రం అయినా సరే అన్ని రకాల ఎమోషన్స్ తెరపై అద్భుతంగా పండించారని, ఈ సినిమాతో తనేంటో నిరూపించుకుంటాడని దర్శకుడు ఎ.మహదేవ్ తెలిపారు. భాషతో సంబంధం లేకుండా మంచి చిత్రాన్ని, నటించగలిగే సత్తావున్న హీరోను ప్రోత్సహించే సంస్కృతి తెలుగు ప్రేక్షకులకు ఉన్నదని, ఈ చిత్రంతో నిఖిల్ తెలుగులో ఓ మంచి హీరోగా ఎదుగుతాడని నమ్మకం వుందని ఆయన అన్నారు. థమన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని, జగపతిబాబు చేసిన పాత్ర ఈ చిత్రంలో హైలెట్‌గా ఉంటుందని ఆయన అన్నారు.