ప్రణయంలో పదనిసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిలీప్, పూనమ్‌కౌర్, అక్షిత ప్రధాన తారాగణంగా శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై ఎ.నరేందర్, విజయానంద్, సురేష్‌గౌడ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రణయం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. ఓ మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రణయంలో జరిగే పలు పదనిసలు లాంటి హృదయానికి హత్తుకునే అంశాలను చిత్రీకరిస్తున్నామని, భావోద్వేగాలకు హృదయంలో జరిగే సంఘర్షణలకు ప్రణయం ఏ విధంగా దారితీసింది అనే కధనంతో సాగే ఈ చిత్రంలో పాటలన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయని అన్నారు. ఒకే షెడ్యూల్‌లో నిరంతరం షూటింగ్ జరిపి, సినిమాను పూర్తిచేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిస్తున్న ఈ చిత్రం తప్పక విజయవంతవౌతుందన్న నమ్మకం ఉందని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ, కెమెరా: రామ్‌కుమార్, మాటలు, పాటలు: నీలకంఠరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఎస్.వి.సత్యప్రసాద్.