ఎక్కడికి పోతావు చిన్నవాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా.. నా చూపుల్లో చిక్కుకున్న వనె్నకాడ..’ అంటూ గతంలో ఓ పాట వచ్చింది. ఆ పాటే ఇప్పుడు హీరో నిఖిల్ చిత్రానికి టైటిల్ అయ్యింది. మేఘన ఆర్ట్స్ పతాకంపై వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో నిఖిల్, హెబాపటేల్, నందితా శే్వత ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందిందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. చిక్‌మగళూరులో జరిపిన షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని, ‘టైగర్’ లాంటి కమర్షియల్ హిట్ చిత్రం తర్వాత ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంతో అంచనాలు భారీగా పెరిగాయని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పేరే మీడియాలో వైరల్ అవుతోందని, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు. ఓ అందమైన ప్రేమకథకు చక్కని కథనాన్ని జోడించి, రూపొందించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైరన్‌గా ఆకట్టుకుంటుందని, ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో పాటలు ఆకట్టుకుంటాయని తెలిపారు.