అపార్ట్‌మెంట్‌లో అబల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నికిత ప్రధాన పాత్రలో శ్రీ క్రియేటివ్ ఫిలింస్ పతాకంపై శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ రూపొందించిన చిత్రం ‘అపార్ట్‌మెంట్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఇటీవల ఈ సినిమా ఆడియోను విడుదల చేశామని, అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, దర్శకుడు తొలి చిత్రమే అయినా, అందరికీ నచ్చేలా తెరకెక్కించారని తెలిపారు. ఖుద్దూస్ అందించిన సంగీతం ఇప్పటికే అనే సెల్‌ఫోన్లలో రింగ్‌టోన్లుగా మారిపోయానని, ఇటువంటి చిత్రం అందిస్తున్నందుకు ఆనందంగా వుందని ఆయన తెలిపారు. ఓ అపార్ట్‌మెంట్ సంస్కృతిలోకి కొత్తగావచ్చిన ఓ అమ్మాయి, అక్కడ ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నది, చివరికి ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే ఇతివృత్తంతో ఈ చిత్రం సాగుతుందని, నికిత ఈ చిత్రంలో చక్కగా నటించిందని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా వుంటుందని దర్శకుడు శివగంగరాజు వుడిమూడి తెలిపారు. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు. సంజన, చిన్నా, ఉత్తేజ్, విజయ్‌సాయి, రక్ష, అల్లరి సుభాషిణి, ప్రి యాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సాబూజేమ్స్, ఎడిటింగ్: నాగిరెడ్డి, సంగీతం:ఖుద్దూస్.ఎస్.కె., నిర్మాత: ఎ.కె. శ్రీకాంత్ అంగళ్ళ, కథ, దర్శకత్వం :శివగంగరాజు వుడిమూడి.