లజ్జ లోగో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుమిత, శివ, వరుణ్ ముఖ్యపాత్రల్లో నరసింహనంది దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై బూచేపల్లి తిరుపతిరెడ్డి నిర్మిస్తున్న ‘లజ్జ’ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రసన్నకుమార్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో అవార్డు పొందిన నరసింహనంది తెరకెక్కిస్తున్న మరో విభిన్నమైన చిత్రమిదని, ఇలాంటి దర్శకుణ్ణి పరిశ్రమ కాపాడుకోవాలని, దాంతో చాలా మంచి చిత్రాలు మరిన్ని వస్తాయన్నారు. దర్శకుడు నరసింహనంది మాట్లాడుతూ, రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన సినిమా ఇదని, అమ్మాయి పెళ్ళైన తరువాత తన భర్త ప్రేమ తనకే స్వంతం కావాలని కలలుకంటుందని, అలాంటి తరుణంలో తను అనుకున్నది జరగకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనే అంశంతో తెరకెక్కించిన చిత్రం ఇదన్నారు. మధుమిత చక్కగా నటించిందని, అన్నిరకాల ఎమోషన్స్ వున్న కమర్షియల్ సినిమా ఇదన్నారు. మధుమిత మాట్లాడుతూ, సుశీల అనే మెచ్యూర్డ్ పాత్రలో నటించానన్నారు. నిర్మాత తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేశామని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ, మహంతి, పి.ఎల్.కె.రెడ్డి, సుక్కు తదితరులు పాల్గొన్నారు.