రామ్‌కు సరిపోయే హైపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా రామ్ ఆచంట, గో పీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూ పొందించిన ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంగీతాన్ని జీబ్రాన్ అందించారు. సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుకుమార్, హరీష్ శంకర్, నాని థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ఈ కథ రామ్‌కు సూటయ్యేలా దర్శకుడు రాశారని, ఇందులో పాటలన్నీ తనకు నచ్చాయని, ముఖ్యంగా ‘బేబీ డాల్’ అందరికీ నచ్చుతుందని ఆయ న అన్నారు. సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుందని, పెద్ద విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. రామ్ మాట్లాడుతూ, హైపర్ కథనం దర్శకుడు చెప్పినప్పుడే తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం కలిగిందని, తనకంటే అతడే హైపర్‌గా పనిచేసి ఈ సినిమాను మూడు నెలల్లోనే పూర్తిచేశాడని తెలిపారు. జీబ్రాన్ పాటలు, సమీర్‌రెడ్డి కెమెరా పనితనం ఈ సినిమాలో హైలెట్‌గా వుంటాయని, ఈనెల 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. రామ్‌తో ఎలాంటి కథ చేయాలో చర్చించి నిర్ణయించుకోవడానికి తమకు మూడు నెలల సమయం పట్టిందని, కమర్షియల్ సినిమా స్టైల్లో కాకుండా ఏదో చెప్పాలని, చెప్పినదాంట్లో నిజాయితీ వుండాలని రాసుకున్న కథే ఇదని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతివారికి వారి తండ్రే హీరో అయితే, తండ్రిని గెలిపించే కథనంగా ఈ చిత్రం వుంటుందని, తన కెరీర్‌లో చేసిన మూడు సినిమాల్లో ఈ చిత్రం బెస్ట్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో హరీశ్ శంకర్, సుకుమార్, నిర్మాతలు పాల్గొన్నారు.
రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావురమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, మాటలు: అబ్బూరి రవి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.