బాహుబలి-2 కోసం ఎదురుచూస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిస్టర్ కూల్ అని అందరిచేత ముద్దుగా పిలిపించేకునే టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని హైదరాబాద్‌లో హంగామా చేశారు. ఆయన జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘ఎంఎస్ ధోని’ (ద అన్‌టోల్డ్ స్టోరీ). చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధోని రావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇక్కడి బిర్యానీ గుర్తుకు వస్తుందని, తొలిసారిగా ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు బిర్యానీ రుచి చూశానని తెలిపారు. ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా బిర్యానీని ఆస్వాదించానని, ఇక్కడి బేకరీ బిస్కట్లు కూడా తనకిష్టమని తెలిపారు.ఎప్పుడు ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడినా హైదరాబాదీల ప్రోత్సాహం మరువలేనిదని, తనకు ఇక్కడ మంచి రికార్డు కూడా ఉందని తెలిపారు.
రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రాన్ని తాను చూశానని, తాను కూడా అందరిలాగే రెండో సినిమాకోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. జీవితంలో ఎవరైనా పైకి రావాలంటే నిజాయితీతో అనుకున్న విషయాన్ని ఆచరణాత్మకంగా పాటించాలని ఆయన యువతకు సూచించారు. జీవితంలో ఎదురయ్యే రిస్క్‌లను ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలని, హార్డ్‌వర్క్‌తో అనువైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని, పెద్దలను గౌరవిస్తూ అందర్నీ సమానంగా చూస్తూ జీవితంలో వినమ్రంగా ఉండే వారికి విజయం తథ్యమని ఆయన తెలిపారు.
హైదరాబాద్ బిర్యానీ, ఉస్మానియా బిస్కట్, లాడ్ బజార్‌లో గాజులంటే తనకు ఎంతో ఇష్టమని ధోని అన్నప్పుడు హర్షధ్వానాలు మారుమోగాయి. కార్యక్రమంలో ఎస్.ఎస్.రాజవౌళి, సినిమా యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. రాజవౌళి మాట్లాడుతూ ధోని అన్నా, క్రికెట్ అన్నా చాలా ఇష్టమని అన్నారు. ధోని రాకముందు క్రికెట్‌ను భయంభయంగా చూసేవాళ్లమని, అయన వచ్చాక క్రికెట్‌లో గెలుపు మజా రుచి చూశామని అన్నారు. ఈ వేడుకకు ధోని రావడం ఆనందంగా ఉందని రాజవౌళి అన్నారు.