సునీల్ గోల్డే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, సుష్మారాజ్, రీచాపనయ్ ప్రధాన తారాగణంగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వీరు పోట్ల దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర రూపొందిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డ్‌ఎహే’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, వచ్చేనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్క పట్నంలో ఒక్కొక్క పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ.. మణిశర్మ తనయుడు సాగర్ ఎం.శర్మ ఈ చిత్రానికి మంచి బాణీలను అందించారని, ఈ ఆల్బమ్‌లోని తొలి పాటను ఈనెల 21న హైదరాబాద్‌లో విడుదల చేశామన్నారు. రెండో పాటను ఈనెల 22న వైజాగ్‌లో, మూడో పాటను రాజమండ్రిలో, నాలుగు పాటను 24న విడుదల చేశామని, అన్ని కేంద్రాలలో చిత్ర యూనిట్‌కు అనూహ్యమైన ఆదరణ లభించిందని తెలిపారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తోందని, ఓ వైవిధ్యమైన కథనంతో రూపొందించిన ఈ చిత్రం మొదటినుండి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటుందని తెలిపారు. ఇద్దరు కథానాయికల మధ్య హీరో సునీల్ చేసే పనులు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తాయని, సినిమాలో ఉన్న తారలందరూ అద్భుతంగా నటించారని ఆయన వివరించారు. జయసుధ, పునీత్ ఇస్సార్, నరేష్, అరవింద్, చరణ్, పృథ్వి, పోసాని, బెనర్జీ, వెనె్నల కిషోర్, షకలక శంకర్, అనంత్, భరత్, రాజారవీంద్ర, సుదర్శన్, పవన్, గణేష్, అవంతిక, అశోక్ తలారి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దేవరాజు, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరు పోట్ల.