భావోద్వేగాల రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్‌కాపీ పిక్చర్స్ పతాకాలపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మన వూరి రామాయణం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, వచ్చేనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నటుడు ప్రకాశ్‌రాజ్ చిత్ర విశేషాలను తెలుపుతూ శ్రీరామనవమి పండుగరోజున జరిగే ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ నడుస్తూ ఉంటుందని, రామాయణం ఇతివృత్తానికి దగ్గరగా ఉంటుందని అన్నారు. రాముడి రూపంలో ఉండే రావణాసురుడి కథగా ఈ చిత్ర కథనం అంతా పాత్రల భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ ఉంటుందని తెలిపారు. దుబాయిలో డబ్బు సంపాదించి వచ్చిన వ్యక్తి కథనంతో సాగే ఈ చిత్రంలో సుశీల, ఆటోవాలా శివ, గరుడ అనే డైరెక్టర్ లాంటి పాత్రలు వచ్చిపోతూంటాయని, ఎవరెవరు వారి జీవితాలను తమ పరిధుల మేరకు నడిపించారో, పరిస్థితులకు తగ్గట్టు ఎలా మారారో ఈ చిత్రంలో తెరకెక్కించామని అన్నారు. రామాయణంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ సాగే ఈ చిత్రంలో రావణాసురుడిగా హీరో మారినప్పుడు హనుమంతుడితో రాముడిని చంపమని సీత చెప్పినప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడా? రాముడిని చంపాడా? అనే విధంగా కథ సాగుతూ వుంటుందని, అదే మన వూరి రామాయణంలో ప్రధానమైన కథనమని ఆయన వివరించారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ షాద్‌నగర్, హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సి, కర్నాటక కూర్గ్ పరిసర ప్రాంతాల్లో చేశామని, ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. సెన్సార్‌వారు యు సర్ట్ఫికెట్ అందించారని, అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఆయన అన్నారు. ప్రియమణి, పృథ్వి, సత్యదేవ్, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: జాయ్‌మాథ్యూ, రమణ గోపిశెట్టి, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కెమెరా: ముఖేష్, సంగీతం: ఇళయరాజా, నిర్మాతలు: ప్రకాశ్‌రాజ్, రామ్‌జీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాశ్‌రాజ్.