చెప్పే చేసుకుంటా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో టాలీవుడ్‌లో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందిన రాజ్‌తరుణ్ ఇప్పుడిప్పుడే మంచి సినిమాలతో ప్రేక్షకాదరణ పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా తాను బుడిబుడి అడుగుల దశలోనే ఉన్నానని చెప్పుకునే ఈ హీరోకు టాలీవుడ్‌లో రేగిన పుకార్లు పెళ్లిచేసేశాయి. లాస్య అనే యాంకర్‌ను అతను రహస్య వివాహం చేసుకున్నాడని, వీరిద్దరి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని ఆ వార్తల సారాంశం. అయితే ఈ విషయంలో ఎటువంటి నిజం లేదని, అది పుకారేనని రాజ్‌తరుణ్ కొట్టేశాడు. లాస్య అనే అమ్మాయిని తాను కుమారి 21ఎఫ్ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకలో ఒకేసారి కలిశానని, అయితే ఇంత త్వరగా తనకు పెళ్లిచేసిన ఆ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి చిత్ర విచిత్రమైన నవ్వొచ్చే పుకార్లు ఎలా పుడతాయో అర్థం కావడంలేదని, అసలు వీటికి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదని ఆయన అన్నారు. తనకు ఇప్పుడే పెళ్లిచేసుకునే ఆలోచన లేదని, మరో మూడేళ్లవరకు తన పెళ్లి విషయం ఆలోచించే ప్రసక్తే లేదని తెలిపారు. తన పెళ్లి ఘడియ వచ్చినప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటానని, ఇంతటితో ఈ పుకార్లకు తెరవేయమని ఆయన కోరారు.

చిత్రం..రాజ్‌తరుణ్