ప్రతి ఇంట్లో ఓ హైపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిపికెట్ వున్న ఈ చిత్రం ఈనెల 30న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత గోపీచంద్ మాట్లాడుతూ- రామ్ కెరీర్‌లోనే ఎక్కువ థియేటర్‌లలో హైపర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. మొత్తం యుఎస్‌లో 92 స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నామని, జూన్ 3న సినిమాను ప్రారంభించి 72 రోజులు షూటింగ్ చేసి పూర్తిచేశామని, ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు. వైజాగ్, హైదరాబాద్‌లలో వర్షాలు పడడంతో షూటింగ్‌కు నాలుగురోజులు ఇబ్బంది పడ్డామని, ఓ మంచి కథతో రూపొందించిన ఈ చిత్రం ప్రతి ఇంట్లో ఓ హైపర్ ఉంటాడని చెబుతుందని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న విధంగా షూటింగ్ పూర్తిచేసి ఈ సినిమాను చెప్పిన టైముకు విడుదల చేస్తున్నందుకు సంతోషంగా వుందని, అందరికీ కనెక్ట్ అయ్యే హైపర్, ప్రతి తండ్రీ కొడుకులకు నచ్చుతుందని అన్నారు. మంచి కథ చెబితేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కనుక అలాంటి చిత్రానే్న చేసే ప్రయత్నం హైపర్ ద్వారా జరిగిందని ఆయన అన్నారు. జీబ్రాన్ మ్యూజిక్, మణిశర్మ రీరికార్డింగ్ ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటాయని తెలిపారు. 99 శాతం ఈ సినిమా క్రెడిట్ అంతా దర్శకుడికే చెందుతుందని, ఈ చిత్రానికి తండ్రీ కొడుకులు కలిసి వస్తే ఓ కూపన్ ఇస్తారని, ఆ కూపన్స్‌లో డ్రా తీసి గెలిచిన వాళ్లకు చదువుకునేందుకు ఐదు లక్షల రూపాయలు అందజేయనున్నామని నిర్మాత అనీల్ సుంకర అన్నారు. కార్యక్రమంలో నిర్మాత రామ్ ఆచంట చిత్ర విశేషాలను తెలిపారు.