దీపావళికి పిల్లరాక్షసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై మిథున్ మాన్యుల్ థామస్ దర్శకత్వంలో సారా అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ‘పిల్ల రాక్షసి’. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో చదలవాడ పద్మావతి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఆన్ మరియ కలిప్పిలానో చిత్రాన్ని తెలుగులో ‘పిల్ల రాక్షసి’గా అనువదించామని, బిచ్చగాడు చిత్రానికి మాటలు, పాటలు అందిచిన భాషాశ్రీ ఈ చిత్రానికి కూడా అందిస్తున్నారని తెలిపారు. బిచ్చగాడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత తమ సంస్థ ద్వారా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా వున్నాయని, అందుకు తగ్గట్లే సినిమా సూపర్‌హిట్ అవుతుందన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు. దర్శకుడు ఓ వైవిధ్యమైన కథనాన్ని తీసుకుని కొత్తతరహా స్క్రీన్‌ప్లేతో రూపొందించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ ఓ అతిథి పాత్రలో నటించడం విశేషమని తెలిపారు. దీపావళికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని అన్నారు. సన్నివాయినె, అంజువర్గీస్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.