బాహుబలి-2 ట్రైలర్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి చిత్రం రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజవౌళి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతోపాటు సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలు కూడా తాము ఎదురుచూస్తున్నామని చెబుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బొమ్మ పడిందంటే కలెక్షన్లు అదుర్స్‌గా వుంటాయని కూడా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి కంక్లూజన్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హీరో ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు వేడుకలకు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ముగింపు సన్నివేశాలను డిసెంబర్‌లో చిత్రీకరించడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈలోపుగా ప్రేక్షకులకు ఓ చిన్న ట్వీట్ ఇవ్వడానికి దర్శకుడు రాజవౌళి సిద్ధమవుతున్నారు. అది ప్రభాస్ జన్మదినోత్సవ వేడుకను ఇలా ఉపయోగిస్తున్నారన్నమాట.