ఇద్దరూ ఇద్దరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ నటుడు మోహన్‌లాల్, ఆమలాపాల్, సత్యరాజ్ ప్రధాన తారాగణంగా జోషి దర్శకత్వంలో కె.ఆర్.్ఫలింస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై కందల కృష్ణారెడ్డి తెలుగులో అందిస్తున్న చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, మోహన్‌లాల్, సత్యరాజ్ పోటీపడి నటించిన ఈ చిత్రంలో ఇద్దరూ ఇద్దరిగానే వుంటారని, ఓ వెరైటీ కథ కథనంతో రూపొందించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని తెలిపారు. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి దగ్గరగా అనువదించామని, త్వరలోనే ఆడియో విడుదల చేసి అక్టోబర్ ద్వితీయార్థంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. రమ్య నంబీసన్, సోనూసూద్, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ఎస్.లోకనాధన్, ఎడిటింగ్:శ్యామ్ శశిధరన్, మాటలు, పాటలు:రామకృష్ణ, సంగీతం:గోపీసుందర్, నిర్మాత:కందల కృష్ణారెడ్డి, దర్శకత్వం:జోషి.