మొదలైన బేబీడాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైజింగ్ సన్ ఫిలిమ్స్ పతాకంపై మానస్, హాషికాదత్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న చిత్రం ‘బేబీ డాల్.’ తాజ్‌మొహమ్మద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కథానాయిక హాషికాదత్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. మానస్, హాషికాదత్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశంపై జగదీష్‌పల్లి క్లాప్ ఇవ్వగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్‌చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హీరోయిన్, దర్శకురాలు హాషికాదత్ మాట్లాడుతూ వయసొచ్చిన ప్రతి కుర్రాడు తనకు కాబోయే భార్య ఇలా వుండాలి అని కలలు కంటుంటాడని, అలా కలలు కనే ఓ కుర్రాడి కథనే ‘బేబీడాల్’గా చిత్రీకరిస్తున్నామని తెలిపారు. న్యూఏజ్ లవ్ స్టోరీగా నిర్మిస్తున్న ఈ చిత్రం యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందని, షూటింగ్ అంతా నెల్లూరులోనే జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. వచ్చేనెల 8నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నామని, హీరో పాత్ర అమాయకంగా ఉంటుందని, కమెడియన్ల పాత్రలన్నీ కీలకంగా ఉంటాయని ఆమె అన్నారు. ఈ కథ చెప్పగానే నచ్చడంతో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీగా రూపొందించడానికి సిద్ధమయ్యారని, హీరోయిన్ సినిమాలో నటనకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని, తన పాత్ర డామినేటెడ్‌గా ఉంటుందని హీరో మానస్ తెలిపారు. కార్యక్రమంలో రాఘవ మాలేటి, మున్నా కాశీ, రవిశంకర్ పర్రి తదితరులు పాల్గొన్నారు. నరేష్, బ్రహ్మానందం, రావురమేష్, సంపూర్ణేష్‌బాబు, తా.రమేష్, సప్తగిరి, సితార, పూర్ణమ భాగ్యరాజ్, సముద్రఖని, సతీష్, ఇమ్రాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రవిశంకర్, ఎడిటింగ్: అనిల్‌కుమార్ జల్లు, సంగీతం: మున్నా కాశీ, కెమెరా: రాఘవ మాలేటి, నిర్మాత: తాజ్ మొహమ్మద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హాషికాదత్.